Polyhouse Farming Guide -2026: పాలిహౌస్ ఫార్మింగ్ ఎలా ప్రారంభించాలి? సబ్సిడీ, పెట్టుబడి, పూర్తి సమాచారం
వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులతో లాభాలు తగ్గుతున్నాయని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చిన్న స్థలంలో కూడా అధిక దిగుబడి సాధించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అలాంటి ఆధునిక వ్యవసాయ విధానాల్లో పాలిహౌస్ ఫార్మింగ్ (Polyhouse Farming) ఒకటి. ఈ గైడ్‌లో పాలిహౌస్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఎలా ప్రారంభించాలి? ప్రభుత్వ సబ్సిడీ ఎలా పొందాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. పాలిహౌస్ ఫార్మింగ్ అంటే ఏమిటి? పాలిహౌస్ అనేది ప్రత్యేకంగా రూపొందించిన నిర్మాణం. ఇందులో ప్లాస్టిక్ షీట్లు లేదా ఇతర పారదర్శక కవరింగ్ ద్వారా మొక్కలకు నియంత్రిత వాతావరణం కల్పిస్తారు. దీని వల్ల అధిక ఎండ, వర్షం, గాలి, కొన్ని తెగుళ్ల ప్రభావం తగ్గి, పంటల నాణ్యత మరియు దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుంది. పాలిహౌస్ ఫార్మింగ్ ప్రారంభించడానికి 5 ముఖ్యమైన దశలు 1. జిల్లా ఉద్యానవన శాఖను సంప్రదించండి మీ జిల్లా ఉద్యానవన శాఖ (District Horticulture Department) అధికారులను కలసి అందుబాటులో ఉన్న పథకాలు(Schemes), సబ్సిడీలు(Subscidy), అర్హతలు(Eligibility) మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. 2...