₹1 లక్ష నుండి ₹10 లక్షల పెట్టుబడితో ప్రారంభించే 5 బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాలు


మనమే సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి, మనకి మనమే బాస్ అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బిజినెస్ కి "పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలేమో, అని మరి నష్టం వస్తే ఎలా?" అనే భయంతో చాలామంది తమ బిజినెస్ చేయాలి అనే కలను వాయిదా వేస్తుంటారు. అయితే వ్యాపారంలో విజయం సాధించడానికి కేవలం భారీ పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు; సరైన ప్రణాళిక, మరియు నిరంతర డిమాండ్ ఉన్న బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

​మీ దగ్గర ₹1 లక్ష నుండి ₹10 లక్షల వరకు బడ్జెట్ ఉండి కొంచెం స్థలం ఉంటే, ఈ 5 అద్భుతమైన తయారీ (Manufacturing) బిజినెస్ లు ఇక్కడ ఉన్నాయి.

​1. టిష్యూ పేపర్ తయారీ (Tissue Paper Manufacturing):

​కోవిడ్ తర్వాత జనాల్లో పరిశుభ్రత (Hygiene) మీద అవగాహన చాలా పెరిగింది. మనం రోజు వెళ్లే రెస్టారెంట్లు, హోటల్లు,బ్యూటీ పార్లర్లు, హాస్పిటల్స్, చివరకు ఈవెంట్లలో మరియు రోడ్డు పక్కన ఉన్న చిన్న పానీపూరి బండి దగ్గర కూడా టిష్యూ పేపర్ వాడకం విపరీతంగా పెరిగింది.




  • దీనికి కావలసిన ​పెట్టుబడి & యంత్రాలు: సుమారు ₹4.5 లక్షల పెట్టుబడితో ఒక ఆటోమేటిక్ టిష్యూ మేకింగ్ మిషన్ తో మొదలు పెట్టవచ్చు.                                                               

  • దీని ఉత్పత్తి సామర్థ్యం: ఈ ఆటోమెటిక్ మిషన్ దాదాపు నిమిషానికి 300 టిష్యూ పేపర్లను ఈ మిషన్ కట్ చేయగలదు అంటే ఒక టిష్యూ పేపర్ ప్యాకెట్లు ఒక 50 టిష్యూ పేపర్లు ఉన్నాయి అనుకుంటే అది నిమిషానికి 6 ప్యాకెట్లు తయారు చేయగలదు.                                                       
  • దీని తయారీ విధానం: మీరు మార్కెట్ నుండి ఒక పెద్ద జంబో టిష్యూ పేపర్ రోల్స్ ను(Jumbo Tissue Rolls)తెచ్చి, సైజు ప్రకారం కట్ చేసి ప్యాక్ చేయడమే మీ పని. అంటే దీని ముడి సరుకు జంబో టిష్యూ పేపర్ రోల్స్.                                                                                        
  • దీని ​మార్కెటింగ్ (B2B): మీ దగ్గర స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, మరియు ఈవెంట్ చేసే మేనేజర్లు, క్యాటరింగ్ సర్వీసులు చేసేవారు, హాస్పిటల్స్‌తో టై-అప్ అయితే మీకు బల్క్ గా ఆర్డర్లు కంటిన్యూఎస్ గా వస్తాయి.                                                                                                            
  • ఈ వ్యాపారంలో ​లాభాలు & స్థలం: ఈ వ్యాపారంలో 25% నుండి 30% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉండే అవకాశం ఉంది. దీనిని మీరు కేవలం ఒక చిన్న 10x10 గదిలో కూడా ప్రారంభించవచ్చు. 

​ఇక ఇప్పుడు రెండవ ఐడియా 

2. పేపర్ బ్యాగ్స్ తయారీ (Paper Bags Manufacturing)

​వాతావరణ కాలుష్యం వల్ల ప్రభుత్వము ప్లాస్టిక్‌ తో తయారుచేసిన పాలిథిన్ కవర్ల మీద నిషేధం పెరగడంతో పేపర్ బ్యాగ్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ఎంతగా అంటే ఆకాశాన్నంటుతోంది. అన్ని స్వీట్ షాపులు, బేకరీలు, బట్టల దుకాణాలతో పాటు ఆన్లైన్ డెలివరీ అయిన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా విస్తృతంగా పేపర్ బ్యాగ్స్‌నే ఉపయోగిస్తున్నాయి.



  • దీని ​పెట్టుబడి: ఒక స్టాండర్డ్ ఆటోమేటిక్ మిషన్‌తో సెటప్ కోసం సుమారు ₹5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ అవసరమవుతుంది.                                                                                                          
  • దీనికి గల ​మార్కెటింగ్ ట్రిక్: దుకాణదారుల వారి షాప్ పేరు, మరియు లోగోలను పేపర్ బ్యాగ్‌పై ఉచితంగా ప్రింట్ చేసి ఇవ్వడం ద్వారా  కస్టమర్లను ఇంకా త్వరగా లేక సులభంగా ఆకట్టుకోవచ్చు.                                                                                                                                             

  • దీని ​లాభాలు: 25% నుండి 35% వరకు లాభం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 వంటి  చిన్న చిన్న పట్టణాల్లో పోటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి బిజినెస్ అవకాశం.

ఇక ఇప్పుడు మూడవ బిజినెస్ ఐడియా

​3. పండ్లు మరియు కూరగాయల డీహైడ్రేషన్ (Dehydration Business):

​ప్రస్తుతం మార్కెట్లో అన్ని  'రెడీ-టు-ఈట్', 'రెడీ-టు-కుక్' ఉత్పత్తులకు ఆదరణ మరియు సేల్స్ ఉన్నాయి. టొమాటోలు, ఉల్లిపాయలు లేదా సీజనల్ పండ్లలోని తేమను తొలగించి (Dehydrate), పొడి లేదా డ్రై పీసెస్‌గా మార్చడం ద్వారా వాటి నిల్వ కాలాన్ని (Shelf Life) పెంచవచ్చు. ఇలాంటి వాటిని అంటే పళ్ళు కూరగాయలు మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకొని వచ్చి మార్కెట్లో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మితే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.



  • దీని పెట్టుబడి:
    • టెస్టింగ్ లెవెల్: దీని మొదట చిన్నగా టెస్టింగ్ కోసం మన ఇంట్లోనే  ప్రారంభించడానికి ₹5,000 డీహైడ్రేటర్ మిషన్ కొని చేసుకోవచ్చు.                                                
    • కమర్షియల్ సెటప్: కమర్షియల్ గా చేయాలి అంటే , కూరగాయలు కలగటానికి ఒక వాషర్, కూరగాయలను కట్ చేయడానికి ఒక స్లైసర్, కమర్షియల్ డీహైడ్రేటర్, ప్యాకేజింగ్ మిషన్లతో కూడిన ప్రొడక్షన్ యూనిట్‌కు ₹3 లక్షల నుండి ₹3.5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది.                                                                                   

  • దీని ​విక్రయ అవకాశాలు: పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లతో పాటు ఎగుమతి (Export) మార్కెట్‌లో కూడా వీటికి భారీగా డిమాండ్ ఉంటుంది.                                                             
  • లాభాలు: ఇది వాల్యూ-అడిషన్ వ్యాపారం కాబట్టి 30% నుండి 40% వరకు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.

​4. అగర్‌బత్తి & దోమల నివారణ బత్తి తయారీ

​దేవుడి పూజ చేయాలన్న అగర్‌బత్తులు, మరియు రాత్రి వేళ దోమల నుండి రక్షణ పొందాల అన్న బత్తులు ప్రతి ఇంట్లో నిత్యం వాడే వస్తువులు. కాబట్టి ఈ వ్యాపారానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.



  • పెట్టుబడి: ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ సుమారు ₹65,000కి మార్కెట్లో దొరికే అవకాశం ఉంది. దీని ముడిసరుకు అయిన బాంబూ స్టిక్స్, ప్రీమిక్స్ పౌడర్, సెంట్, ప్యాకింగ్  కోసం మరో ₹50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మొత్తం దాదాపు సుమారు ₹1 లక్ష నుండి ₹1.25 లక్షలతో ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు.                                                                    
  • ప్రత్యేకత: మనం వాడే ఒకే ఆటోమేటిక్ మిషన్‌తో అటు అగర్‌బత్తులు, ఇటు దోమల నివారణ బత్తులు రెండింటినీ తయారు చేయవచ్చు. అంటే రెండు రకాలుగా సంపాదించవచ్చు.                                                                                                                                     

  • లాభాలు: మనం వీటిని హోల్‌సేల్‌గా అమ్మినా కానీ 30% నుండి 35% లాభం ఉంటుంది. సొంత బ్రాండ్, మంచి సువాసన, ప్యాకింగ్‌తో రిటైల్ మార్కెట్‌లోకి వెళ్తే ఇంకా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. గృహిణులకు అయితే ఇంటి దగ్గర ఉండే ఈ వ్యాపారం చాలా సులువుగా చేసుకోవచ్చు.

​5. PET బాటిల్స్ & జార్లు (PET Bottles & Jars Manufacturing)

​మీ దగ్గర మంచి బడ్జెట్ ఉండి, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో అంటే కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలనుకునే వారికి ఇది సరైన బిజినెస్ ఛాయిస్ కావచ్చు. దీనిలో తయారు చేసే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, వంటనూనె డబ్బాలు, ప్లాస్టిక్ జార్ల తయారీ కోసం 'పెట్ బ్లోయింగ్ మిషన్' (PET Blowing Machine) ఉపయోగిస్తారు.



  • దీని ​పెట్టుబడి & అవసరాలు: పెట్ బ్లోయింగ్ మిషన్, కంప్రెషర్, చిల్లర్, డ్రైయర్ మరియు మోల్డ్స్ కలిపి దాదాపు సుమారుగా ₹9 లక్షల నుండి ₹10 లక్షలు పెట్టుబడి అవసరం ఉండొచ్చు. ఈ యంత్రాలు నడుపుటకు 3-ఫేజ్ కరెంట్ మరియు కొంత విస్తారమైన ఖాళీ స్థలం ఉంటే సరిపోతుంది.                                                                                                                         

  • అనుకూలత: మోల్డ్ (Mould) మార్చడం ద్వారా ఒకే మిషన్‌పై మనకు కావలసిన రకరకాల సైజులు, షేప్‌లలో బాటిళ్లను తయారు చేసుకోవచ్చు.
  • లాభాలు:   మీరు ఈ ఉత్పత్తులను రెగ్యులర్గా వాడే వాటర్ ప్లాంట్లు, ఆయిల్ మిల్లులతో టై-అప్ అయితే ప్రతినెలా కంటిన్యూయస్ బల్క్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో 25% నుండి 30% వరకు ప్రాఫిట్ మార్జిన్ పొందే అవకాశం ఉంది.

​మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు తీసుకోల్సిన 5 కీలక జాగ్రత్తలు మరియు పాయింట్స్

​ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేయాలని అనుకున్న, కేవలం బడ్జెట్ ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకోకండి. మీరు ఈ క్రింది సూత్రాలను తప్పక పాటించండి:


  1. మార్కెట్ విశ్లేషణ: మొదట మార్కెట్ ని రీసెర్చ్ చేయండి తర్వాత మీ స్థానిక మార్కెట్‌లో కనీసం 10 నుండి 20 మంది పొటెన్షియల్ ఉన్న కస్టమర్లతో నేరుగా మాట్లాడండి.                                    
  2. పోటీదారుల అధ్యయనం: ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో మీరు ఉత్పత్తి చేసే Products లను ఏ ధర కి అమ్ముతున్నారో తెలుసుకోండి.                                                                                                  
  3. కొటేషన్ పొందడం: మిషన్ కొనేముందు ఒకసారి సప్లయర్ల నుండి రాతపూర్వక కొటేషన్ (Written Quotation) తీసుకోండి.                                                                                                                  
  4. యూనిట్ కాస్ట్ లెక్కింపు: ముడిసరుకు, కరెంట్ బిల్లు, లేబర్, ట్రాన్స్‌పోర్ట్, వేస్టేజ్ అన్నీ కలిపి ఒక యూనిట్ తయారీకి అయ్యే అసలు ఖర్చును (Actual Cost per Unit) స్పష్టంగా లెక్కించండి. ఎందుకంటే దీనివల్లనే మీకు అసలైన ప్రాఫిట్ ఎంత ఉంటుందో క్లియర్ గా తెలుస్తుంది.                                                                                                                                                
  5. ట్రయల్ రన్: మొదటగా మీరు చిన్న ట్రయల్ బ్యాచ్ తయారు చేసి కస్టమర్ల రెస్పాన్స్ చూశాకే పెట్టుబడి పెట్టండి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోకండి.
  6. గుర్తుంచుకోండి: ముందు మిషన్ కొనడం కాదు... ముందు మార్కెట్‌లో మీ ప్రొడక్ట్ డిమాండ్‌ను ధృవీకరించుకోవడం (Validate) అత్యంత ముఖ్యం!

    For Details Of Tissue paper  Machinery

    Small And Medium Business Industry 

    New Delhi Conmtact:7949354190


    Feather Touch Tissues

    Coimbatore, Tamil Nadu, Contact :07949347283

    For Details Of Paper Bag Machinery

                                                                                                                                                             Machine World,Kolkata,WB. Contact:8100540400


    For Details Of Dehydrator  

    Emtex Machinery Private Limited New Delhi. Contact:91-8043886644


    For Details Of Agarbatti Making Machien

    Nilesh Engineers
    Ahmedabad,Gujkarat
    Contact:7949355596 



    For Details Of PET Botteles

    SR Tools ,Hyderabad
    +91-8047679350






    ముఖ్య గమనిక / కస్టమర్ హెచ్చరిక (Buyer Advisory Disclaimer):

    డిస్క్లైమర్: ఈ పోస్ట్‌లో అందించిన యంత్రాలు (Machinery) మరియు సప్లయర్ల (Suppliers) వివరాలు కేవలం మీ అవగాహన మరియు ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి. IndiaMART లో సేకరించిన రివ్యూలు మరియు సమాచారం ఆధారంగా వీటిని పేర్కొనడం జరిగింది.

    కొనుగోలుదారులు గమనించవలసిన విషయాలు:

    • డబ్బులు చెల్లించే ముందు: ఏ మిషన్ సప్లయర్‌కూ ముందస్తుగా (Advance Payment) పూర్తి డబ్బులు పంపవద్దు.
    • నేరుగా పరిశీలించండి: వీలైతే మిషన్ తయారీ కేంద్రాన్ని (Factory/Showroom) నేరుగా సందర్శించండి లేదా కనీసం వీడియో కాల్ ద్వారా లైవ్ డెమో (Live Demo) చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.
    • ధృవీకరణ: యంత్రం నాణ్యత, పనితీరు, వారంటీ (Warranty), జీఎస్టీ బిల్లు (GST Invoice) మరియు అమ్మకం తర్వాత ఇచ్చే సర్వీస్ (After-Sales Service) వివరాలను స్వయంగా సరిచూసుకోండి.

    ​మీ లావాదేవీలు మరియు కొనుగోలు నిర్ణయాలకు మీదే పూర్తి బాధ్యత. సప్లయర్లతో జరిగే ఎలాంటి ఆర్థిక నష్టాలకు లేదా వివాదాలకు ఈ ఛానెల్/వెబ్‌సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

    డిస్క్లైమర్: ఈ వ్యాసంలో అందించిన సమాచారం (పెట్టుబడి వివరాలు, మిషన్ల ధరలు, లాభాల శాతాలు మరియు మార్కెటింగ్ అంచనాలు) కేవలం పాఠకుల అవగాహన మరియు సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఏ వ్యాపారాన్ని ప్రారంభించే ముందైనా స్థానిక మార్కెట్ పరిస్థితులు, ముడిసరుకుల ధరలు మరియు యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇందులో పేర్కొన్న సంఖ్యలు మార్కెట్ మార్పులను బట్టి మారవచ్చు. ఏ వ్యాపారంలోనైనా లాభనష్టాలు మీ సొంత ప్రణాళిక, నిర్వహణ మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత వ్యాపార నిపుణులు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాల్సిందిగా మనవి. 

Comments

Popular posts from this blog

రూపాయి కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్: కాంట్రాక్ట్ స్టాఫింగ్ (మ్యాన్‌పవర్ సప్లై) బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి?

కొబ్బరి వ్యర్థాలతో కోట్ల వ్యాపారం: Waste to Wealth బిజినెస్ గైడ్