కొబ్బరి వ్యర్థాలతో కోట్ల వ్యాపారం: Waste to Wealth బిజినెస్ గైడ్


మనం నిత్యం ఆలయాల్లో కొట్టిన కొబ్బరి కాయలు మరియు వాటి పెంకులను లేదా వేసవిలో రోడ్డు పక్కన తాగిన కొబ్బరి బోండాల వ్యర్థాలను సాధారణంగా మనం "చెత్త" గా అనుకుని పడేస్తుంటాం. కానీ, ఒక సరైన వ్యాపార ఆలోచన (Business Vision) ఉన్న వ్యక్తి ఉంటే... ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు లభించే ఈ కొబ్బరి వ్యర్థాలతోనే ప్రతినెలా నెలా లక్షల్లో ఆదాయన్ని పొందే "Waste to Wealth" వ్యాపారాన్ని Start చేయవచ్చు.


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ రహిత (Eco-friendly) ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొబ్బరి నుంచి వచ్చే వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ కూడా అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా మారింది.


కొబ్బరి పెంకులు, కొబ్బరి పీచు మరియు కోకో పీట్ బ్రిక్స్ డిస్ప్లే



1. ఈ ఈకొబ్బరి వ్యర్థాలకు ఉన్న అంతర్జాతీయ డిమాండ్

మనం చెత్త అనుకోని తాగి పడేసిన కొబ్బరి బోండాలు, మరియు పెంకుల నుంచి ముఖ్యంగా రెండు రకాల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి అవి:


• కొబ్బరి పీచు (Coconut Coir/Fiber) & కోకో పీట్ (Coco Peat)

• కొబ్బరి బొగ్గు (Coconut Shell Charcoal) & యాక్టివేటెడ్ కార్బన్ (Activated Carbon)


ఈ ఉత్పత్తులను అమెరికా, యూరప్ వంటి దేశాల్లో  మరియు గల్ఫ్ దేశాలలో ఆర్గానిక్ వ్యవసాయం చేయటానికి మరియు గార్డెనింగ్ మరియు ఇండస్ట్రియల్ ఫిల్ట్రేషన్ కోసం వీటిని భారీగా దిగుమతి చేసుకుంటున్నారు.


2. కోకో పీట్ (Coco Peat) మరియు కొబ్బరి పీచు వ్యాపారం:

కొబ్బరి కాయ పైపొర (Husk) నుండి పీచు నుండి తయారు చేసిన తర్వాత మిగిలే పొడినే కోకో పీట్ (Coco Peat) అంటారు.


• దీనివల్ల ఉపయోగాలు: దీనికి నీటిని ఎక్కువ సేపు తనలో ఉంచుకునే శక్తి ఉంటుంది. కాబట్టి దీనిని నర్సరీలు, హోమ్ గార్డెనింగ్ చేసేవారు వారి సాగులో మట్టికి ప్రత్యామ్నాయంగా దీన్ని  ఉపయోగిస్తున్నారు.

•దీని ఉత్పత్తి విధానం: కొబ్బరి పీచును సేకరించి 'డీఫైబరింగ్ మిషన్' ద్వారా పీచు మరియు కోకో పీట్ పొడిని వేరు చేస్తారు. ఆ తర్వాత  దాని నుండి వచ్చిన పొడిని ఎండబెట్టి, హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా 5 కిలోల బరువు ఉండే బ్రిక్స్‌గా (Bricks) కంప్రెస్ చేసి తయారు చేస్తారు.

కొబ్బరి వ్యర్థాల ఫ్యాక్టరీలో పీచు తయారుచేసే డీఫైబరింగ్ మిషన్



3. కొబ్బరి పెంకుల బొగ్గు (Activated Carbon) వ్యాపారం:


మనం పడేసిన మరియు ముక్కలైన కొబ్బరి పెంకులు (Coconut Shells) సాధారణ వ్యర్థాలు కావు. ఇవి అత్యంత ఖరీదైన యాక్టివేటెడ్ కార్బన్ తయారీకి కావలసిన ముడిసరుకు.


•దీని ఉపయోగాలు: మనం నిత్యం ఉపయోగించే వాటర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ఫిల్టర్లు, మన చర్మ సౌందర్యం కు ఉపయోగించే ఫేస్ వాష్‌లు, తయారీలో ఉపయోగిస్తారు మరియు ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో నల్లటి కొబ్బరి బొగ్గు పొడిని విస్తృతంగా వాడతారు.

• దీని తయారీ విధానం: ఈ కొబ్బరి పెంకులను తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో కాల్చి బొగ్గుగా మారుస్తారు. దీనినే Pyrolysis అంటారు. దాని నుండి వచ్చే ఆవిరి (Steam) ద్వారా ప్రాసెస్ చేసి యాక్టివేటెడ్ కార్బన్‌గా మారుస్తారు.



4. పెట్టుబడి మరియు అవసరమైన యంత్రాలు (Investment & Machinery)


ఈ వ్యాపారాన్ని మీరు చిన్న స్థాయి (Small Scale) నుండి భారీ స్థాయి (Large Scale) వరకు ప్రారంభించవచ్చు.మీ దగ్గర కావలసినంత అంటే తక్కువ పెట్టుబడి తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు మొదట Raw మెటీరియల్ సేకరణ ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. 

కొంచెం పెట్టుబడి పెట్టి స్తోమత ఉన్నవారు చిన్న యంత్రాల ద్వారా ఈ బిజినెస్ ని రన్ చేయవచ్చు లేదా బ్యాంకు లోన్ ద్వారా అయినా కావలసిన పెట్టుబడిని పొందవచ్చు దీనికి కొన్ని ప్రభుత్వ సబ్సిడీలు కూడా వర్తిస్తాయి.ఈ సబ్సిడీల వివరాలు మీకు లోకల్ గా ఉన్న అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు ఈ సబ్సిడీ వివరాలు ప్రాంతాన్ని మరియు సమయమును బట్టి మారవచ్చు. కాబట్టి మీరు ప్రారంభించే ముందు మీ దగ్గరలో ఉన్న అధికారులను సంప్రదించవచ్చు.


5. లాభాలు మరియు మార్కెటింగ్ వ్యూహాలు (Profits & Marketing)

• లాభాల శాతం: ఈ వ్యాపారం కు కావలసిన ముడిసరుకు చాలా తక్కువ ధరకు లేదా ఉచితంగా కూడా లభిస్తుంది కాబట్టి 30% నుండి 45% వరకు నికర లాభం (Net Profit) పొందే అవకాశం ఉంది.

• స్థానిక మార్కెటింగ్: ఈ ఉత్పత్తులను  స్థానికంగా ఉన్న నర్సరీలు, ఫెర్టిలైజర్ షాపులు, ఆర్గానిక్ ఫామ్స్ మరియు గార్డెనింగ్ స్టోర్లకు సరఫరా చేయవచ్చు.

• ఎగుమతులు (Exports): B2B పోర్టల్స్ (Indiamart, Alibaba) ద్వారా అంతర్జాతీయ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని ఇండియా నుండి విదేశాలకు ఎగుమతి చేయవచ్చు.


6. ప్రభుత్వ సబ్సిడీలు & రుణాలు (Government Schemes) :

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు "ఉపాధి కల్పన" లో భాగంగా మరియు "వేస్ట్ మేనేజ్‌మెంట్" కింద ఈ వ్యాపారానికి భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

• PMEGP పథకం: ఈ పథకం ద్వారా ప్రాజెక్ట్ వ్యయంలో 15% నుండి 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది.

• MUDRA Loans: ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకు ద్వారా ₹10 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది.

• Coir Board Subsidies: కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమల కోసం కాయిర్ బోర్డ్ ప్రత్యేక రాయితీలను అందిస్తుంది.

కోకో పీట్ బ్లాక్‌లో పెరుగుతున్న పచ్చటి చిన్న మొక్క


ముగింపు:

మన చుట్టూ ఉన్న చెత్తను సంపదగా మార్చే ఆలోచనే "Waste to Wealth". సరైన ప్లానింగ్, మరియు  నాణ్యమైన ఉత్పత్తి, మరియు మార్కెటింగ్ నైపుణ్యాలు ఉంటే కొబ్బరి వ్యర్థాల వ్యాపారంలో మనం తిరుగులేని విజయం సాధించవచ్చు.

గమనిక: ఈ వ్యాపారానికి సంబంధించి ప్రత్యక్ష ప్రాసెసింగ్ మరియు పూర్తి వివరాల కోసం నా యూట్యూబ్ వీడియోను తప్పకుండా చూడండి.

                                                                   

                                                                 Thank you 



డిస్క్లైమర్ (Disclaimer):ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం కేవలం అవగాహన మరియు విద్యా ప్రయోజనాల (Educational & Informational Purpose) కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న పెట్టుబడి అంచనాలు, యంత్రాల ధరలు, మరియు లాభాల శాతాలు మార్కెట్ పరిస్థితులు, ప్రాంతం మరియు సమయాన్ని బట్టి మారే అవకాశం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లేదా ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందు దయచేసి సంబంధిత రంగ నిపుణులను, బ్యాంక్ అధికారులను లేదా ప్రభుత్వ శాఖలను సంప్రదించి స్వయంగా పూర్తి పరిశోధన (Research) చేసుకోండి. ఈ సమాచారం ఆధారంగా మీరు తీసుకునే వ్యాపార నిర్ణయాలకు లేదా జరిగే లాభనష్టాలకు ఈ వెబ్‌సైట్ లేదా రచయిత ఎలాంటి బాధ్యత వహించరు.

Comments

Popular posts from this blog

₹1 లక్ష నుండి ₹10 లక్షల పెట్టుబడితో ప్రారంభించే 5 బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాలు

రూపాయి కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్: కాంట్రాక్ట్ స్టాఫింగ్ (మ్యాన్‌పవర్ సప్లై) బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి?