ఇగో పక్కన పెట్టి ₹50,000 తో రోబోట్ బోరింగ్ బిజినెస్! (Vending Machine Business Master Class)
మనం నిద్రపోతున్నా, మనం ఊరెళ్లినా సరే మన బ్యాంకు అకౌంట్ లోకి నిరంతరంగా డబ్బులు వస్తూనే ఉండే ఒక వ్యాపారం ఉంటే ఎలా ఉంటుంది? దీనినే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 'ప్యాసివ్ ఇన్కమ్' (Passive Income) అంటారు.
సాధారణంగా ఏ బిజినెస్ చేయాలన్నా ఉదయం షాప్ తెరవాలి, కస్టమర్లతో బేరసారాలు ఆడాలి, సేల్స్ మెన్స్ ని జీతానికి పెట్టుకోవాలి, వాళ్ళు రాకపోతే మనం టెన్షన్ పడాలి.
ఒకవేళ మనం ఎప్పుడైనా ఊరెళ్తే షాప్ మూతపడుతుంది, ఆదాయం ఆగిపోతుంది. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ బిజినెస్ కు ఎలాంటి సేల్స్ మెన్స్ అవసరం లేదు, వందల గజాల స్థలం అక్కర్లేదు, 24 గంటలు మనం అక్కడ నిలబడాల్సిన పని అసలే లేదు.
మీ తరపున ఒక రోబోట్ లాంటి మెషిన్ నిరంతరంగా కస్టమర్ల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. అదే "స్మార్ట్ వెండింగ్ మెషిన్స్ బిజినెస్" (Smart Vending Machine Business).
ఈ ఆర్టికల్ లో అసలు వెండింగ్ మెషిన్ బిజినెస్ మోడల్ ఏంటి? మన ఇండియాలో వీటికి ఎలాంటి డిమాండ్ ఉంది? మెషిన్లు ఎక్కడ కొనాలి? పర్మిషన్లు ఎలా తెచ్చుకోవాలి? ఒకే ఒక్క మెషిన్ తో నెలకి వేలల్లో, లక్షల్లో లాభాలు ఎలా సంపాదించాలో పూర్తి వివరాలతో నేర్చుకుందాం.
జపాన్ కేస్ స్టడీ (Japan Case Study): ఆటోమేషన్ పవర్
ప్రపంచంలోనే ఈ వెండింగ్ మెషిన్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జపాన్ దేశం గురించి మాట్లాడుకుంటే... అక్కడ ప్రతి 23 మందికి ఒక వెండింగ్ మెషిన్ ఉంటుంది. వారు వీటిని కేవలం స్నాక్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా వేడి వేడి నూడుల్స్, తాజా పండ్లు, ఐస్ క్రీమ్స్, చివరికి బట్టలు, గొడుగులు కూడా అక్కడ మెషిన్లలోనే అమ్ముతారు.
జపాన్ లో ఈ బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి:
స్థలం కొరత: అక్కడ షాపులు పెట్టడానికి షాప్ కి గల రెంట్స్ చాలా ఎక్కువ.
లేబర్ కాస్ట్: ఒక మనిషిని పనిలో పెట్టుకుంటే ఇచ్చే జీతాలు కూడా చాలా ఎక్కువే అక్కడ.
క్యాష్ లెస్ టెక్నాలజీ: జనాలు కూడా ఆటోమేషన్ కి చాలా ఈజీగా అలవాటు పడ్డారు.
ప్రస్తుతం మన ఇండియాలోని బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీలలో కూడా సరిగ్గా ఇదే ట్రెండ్ స్టార్ట్ అయింది.
ఇక మన ఐటీ హబ్ లలో స్పేస్ రెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు. ఒక చిన్న టీ బంకు పెట్టాలన్నా నెలకి వేలల్లో అద్దె కట్టాలి, పైగా నమ్మకమైన వర్కర్లు దొరకడం చాలా కష్టం.
ఈ సమస్యలన్నిటికీ ఏకైక పర్మనెంట్ సొల్యూషన్—వెండింగ్ మెషిన్స్.
వెండింగ్ మెషిన్లలోనీ రకాలు (Types of Vending Machines)
మార్కెట్ లో మన బడ్జెట్ మరియు మన లొకేషన్ ని బట్టి నాలుగు ముఖ్యమైన కేటగిరీల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి:
1. స్నాక్ అండ్ బేవరేజ్ మెషిన్స్ (Snack & Beverage Machines)
ఇది మోస్ట్ పాపులర్ మోడల్. మెషీన్ కు ముందు భాగంలో గ్లాస్ ఉంటుంది, దీనివల్ల లోపల ఏమున్నాయో కస్టమర్ కి స్పష్టంగా మరియు క్లియర్గా కనిపిస్తుంది.
బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ వంటివి ఇందులో అమ్ముతారు. ఇందులో స్పైరల్ స్ప్రింగ్ సిస్టం ఉంటుంది. మనం యూపిఐ పేమెంట్ గాని లేదా క్యాష్ ద్వారా పే చేయగానే ఆ స్ప్రింగ్ తిరిగి వస్తువు కింద పడుతుంది.
2. హాట్ బేవరేజ్ మెషిన్స్ (Hot Beverage Machines)
ఇవి కేవలం టీ, కాఫీ, గ్రీన్ టీ, హాట్ చాక్లెట్ వంటివి instent గా cups లో అందించే మెషిన్లు.వీటిని ఏదైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఫ్లోర్లు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని వెయిటింగ్ రూమ్స్ లలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
3. స్మార్ట్ రిఫ్రిజిరేటెడ్ ఫ్రెష్ ఫుడ్ మెషిన్స్ (Smart Refrigerated Fresh Food Machines)
ఇది ఇండియాలో లేటెస్ట్ ట్రెండ్. ఇందులో లోపల cooling system ఉంటుంది. రోజువారీగా తయారు చేసిన sandwich, సలాడ్లు, ఇడ్లీ, దోశ లాంటి breakfast ప్యాకెట్లు, మజ్జిగ బాటిల్స్ ఇందులో ఉంచుతారు. Health కాన్షియస్ ఎక్కువగా ఉన్న IT employees వీటిని బాగా ఇష్టపడతారు.
4. స్పెషాలిటీ వెండింగ్ మెషిన్స్ (Specialty Vending Machines)
ఇందులో శానిటరీ ప్యాడ్స్,మనం వాడే మాస్కులు, మరియు బేసిక్ మెడిసిన్స్ అంటే హాస్పిటల్స్, ఉమెన్స్ హాస్టల్స్ లో వీటిని పెట్టొచ్చు లేదా చిన్న పిల్లల బొమ్మలు కూడా అమ్ముతుంటారు.
కేవలం ₹50,000 తో ప్రారంభించే క్లాసిక్ మోడల్!
"అబ్బా! ఇవన్నీ హైటెక్ మెషిన్లు, మాకు అంత బడ్జెట్ లేదు, మేము ఉండేది చిన్న టౌన్" అని కంగారు పడకండి. మన ఇండియాలో వెండింగ్ మెషిన్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే ఒక క్లాసిక్ ఆటోమేటెడ్ మెషిన్ మనల్ని కోటీశ్వరులను చేసింది.
మనం Bustands లేదా Railway stations వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లైట్లతో మెరుస్తూ, లోపల ఉన్న ఒక రంగుల చక్రం తిరుగుతూ ఉండే వేయింగ్ మెషిన్స్ (Weighing Machines - బరువు చూసే యంత్రాలు) చూసే ఉంటాం.
ఇది కూడా ఒక పక్కా వెండింగ్ మెషిన్ బిజినెస్ మోడలే!
కానీ జస్ట్ మన బరువు చూసుకోవడానికి ఒక ₹5 కాయిన్ వేస్తాం.
అప్పుడు ఆ మెషిన్ ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేసి, ఒక చిన్న కార్డు మీద మన బరువును ప్రింట్ చేసి బయటకి ఇస్తుంది.
అక్కడ మెషిన్ నడిపే ఓనర్ ఉండడు, జీతాలు ఇచ్చే పని లేకుండా ఎంప్లాయ్స్ కూడా ఉండరు. కానీ ఆ machine మాత్రం నిరంతరంగా ఎప్పుడూ కూడా coins కలెక్ట్ చేస్తూనే ఉంటుంది.
దీనికి ఎలాంటి పెద్ద చదువు, టెక్నాలజీ నాలెడ్జ్ అవసరం లేదు. కేవలం రోజుకి ఒకసారి వెళ్లి ఆ కాయిన్ బాక్స్ ఓపెన్ చేసి డబ్బులు తెచ్చుకోవడమే!
మరి మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే లొకేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
సక్సెస్ కి కీలకం: లొకేషన్ (The King of Location)
వెండింగ్ మెషిన్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి 90% కారణం లొకేషన్. మీరు ₹5 లక్షల రూపాయలు పెట్టి most advanced మెషిన్ కొని ఎవరూ తిరగని చోట పెడితే మీకు రూపాయి కూడా రాదు. అదే ఒక బిజీ ఏరియాలో పెడితే కొన్ని గంటల్లోనే స్టాక్ ఖాళీ అవుతుంది.
మనం టార్గెట్ చేయాల్సిన బెస్ట్ లొకేషన్లు:
ఐటీ పార్కులు మరియు కార్పొరేట్ ఆఫీసులు: ఇక్కడ night shift లు చేసే ఉద్యోగులు ఉంటారు.
అర్ధరాత్రి వేళల్లో బయట షాపులు మూసి ఉంటాయ్ అప్పుడు వీరికి ఈ వెండింగ్ మెషిన్లే వారికి ఉపయోగపడతాయి.
Metro Stations(మెట్రో స్టేషన్),RTC Bus stand (ఆర్టీసీ బస్ స్టాండ్లు), రైల్వే స్టేషన్లు: రోజుకు లక్షల మంది జనాలు ప్రయాణించే ప్రాంతాలు. ప్రయాణం చేసే తొందరలో ఉండేవాళ్ళు లైన్ లో నిలబడకుండా ఈజీగా కొనుక్కుంటారు.
పెద్ద పెద్ద హాస్పిటల్స్(Hospitals): గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు, అటెండర్లు, పేషెంట్ల తరపున ఉండే బంధువులు అర్ధరాత్రి పూట టీ లేదా స్నాక్స్ కోసం ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
పెద్ద పెద్ద కాలేజీలు మరియు కోచింగ్ సెంటర్స్: విద్యార్థులు ఎక్కువగా ఉండే ఏరియాలో ప్యాకేజ్డ్ స్నాక్స్ కి భారీగా డిమాండ్ ఉంటుంది.
లొకేషన్ ఎంపిక నియమాలు:
రోజుకు కనీసం 500 నుండి 1000 మంది జనసంచారం ఉండాలి.
చుట్టుపక్కల ఒక 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నార్మల్ కిరాణా షాప్ లేదా Tea కొట్టు ఉండకూడదు.
24/7 పవర్ సప్లై మరియు సీసీటీవీ కెమెరా/సెక్యూరిటీ ఉండాలి.
పెట్టుబడి మరియు ఖర్చులు (Investment Details)
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో మన బడ్జెట్ ని బట్టి మూడు రకాల Options (ఆప్షన్లు) ఉన్నాయి:
ఆప్షన్ 1 Bus stand (బస్ స్టాండ్ వేయింగ్ మెషిన్స్): వీటి ధర కేవలం ₹40,000 నుండి ₹70,000 లోపే వచ్చేస్తాయి. తక్కువ ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్.
ఆప్షన్ 2 Basic Automatic Snack Machine (బేసిక్ ఆటోమేటిక్ స్నాక్ మెషిన్):దీని ధర సుమారు ₹1,50,000 నుండి ₹2,50,000 వరకు ఉంటుంది (నోట్లు లేదా కాయిన్స్ ఆప్షన్ ఉంటుంది).
ఆప్షన్ 3 Smart Touch Screen Machine (స్మార్ట్ టచ్ స్క్రీన్ మెషిన్): దీని ధర సుమారు ₹3,00,000 నుండి ₹4,50,000 వరకు ఉంటుంది (క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయవచ్చు).
స్మార్ట్ మెషిన్ సెటప్ అంచనా బడ్జెట్ (సుమారుగా):
స్మార్ట్ మెషిన్ కొనుగోలు: ₹3,50,000
లొకేషన్ అడ్వాన్స్ / రెంట్: ₹20,000 - ₹50,000
మొదటిసారి లోడ్ చేసే స్నాక్స్/డ్రింక్స్: ₹15,000
ట్రాన్స్పోర్టేషన్ & ఇన్స్టాలేషన్: ₹10,000
మొత్తం పెట్టుబడి: సుమారు ₹4,00,000 నుండి ₹4,50,000.
(గమనిక: మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే ₹50,000 లోపు వేయింగ్ మెషిన్ తో స్టార్ట్ చేయవచ్చు. లేదా కొన్ని కంపెనీలు నెలకి ₹15,000 రెంట్ కి కూడా మెషిన్లు ఇస్తాయి. అలాగే బ్యాంక్ ముద్రా లోన్ ద్వారా 80% వరకు లోన్ కూడా పొందవచ్చు.)
లాభాల లెక్కలు (Profit Matrix)
వెండింగ్ మెషిన్ లో అమ్మే బ్రాండెడ్ వస్తువుల (లేస్, కుర్కురే, కోకాకోలా మొదలైనవి) పైన 20% నుండి 30% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. (అదే వేయింగ్ మెషిన్ లో ప్రింటింగ్ పేపర్ రోల్ ఖర్చు 50 పైసలు పోను మిగిలిన ₹4.50 పైసలు అంటే 90% నికర లాభం ఉంటుంది).
ఒక యావరేజ్ స్మార్ట్ స్నాక్ మెషిన్ రోజువారీ సేల్స్ లెక్క చూద్దాం:
ఒక బిజీ లొకేషన్ లో రోజుకి 100 మంది కస్టమర్లు వచ్చి, తలా ₹40 విలువైన స్నాక్స్ కొంటే:
రోజువారీ సేల్స్: 100 × ₹40 = ₹4,000
నెలవారీ సేల్స్ (30 రోజులు): ₹1,20,000
ఖర్చులు:
సరుకులు కొనే అసలు ఖర్చు (75%): ₹90,000
లొకేషన్ రెంట్ / కమిషన్: ₹10,000
కరెంట్ బిల్లు: ₹2,000
ఇంటర్నెట్ & సాఫ్ట్ వేర్ మెయింటెనెన్స్: ₹1,000
మొత్తం ఖర్చులు: ₹1,03,000
నెలవారీ నికర లాభం (Net Profit): ₹17,000
స్కేలింగ్ మ్యాజిక్ (Scaling Up):
ఈ బిజినెస్ ని చాలా ఈజీగా స్కేల్ అప్ చేయవచ్చు. మీరు ఒకే సిటీలో వేరు వేరు లొకేషన్లలో ఒక 10 మెషిన్లు పెడితే:
నెలవారీ లాభం: 10 × ₹17,000 = ₹1,70,000 దీనికోసం మీరు రోజుకు కేవలం 1 నుండి 2 గంటల టైమ్ కేటాయిస్తే సరిపోతుంది.
టెక్నాలజీ మ్యాజిక్: టెలీమెట్రీ సాఫ్ట్ వేర్ (Telemetry Software)
పది మెషిన్లు పెడితే ఏ మెషిన్ లో సామాన్లు అయిపోయాయో తెలుసుకోవడానికి ప్రతి మెషిన్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ప్రస్తుతం వచ్చే అన్ని స్మార్ట్ వెండింగ్ మెషిన్లలో టెలీమెట్రీ (Telemetry) సాఫ్ట్ వేర్ ఉంటుంది.
ఇది మీ మొబైల్ యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏ మెషిన్ లో ఏ ప్రాడక్ట్ అయిపోయిందో, ఈరోజు ఏ మెషిన్ లో ఎంత సేల్ అయింది, ఎంత క్యాష్ వచ్చింది అనేది మీ మొబైల్ లైవ్ డాష్ బోర్డ్ లోనే కనిపిస్తుంది. మీరు వారానికి 2 లేదా 3 సార్లు హోల్ సేల్ గా సరుకులు కొని, స్టాక్ తక్కువ ఉన్న మెషిన్లలో రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది.
లొకేషన్ పర్మిషన్ ఎలా పొందాలి? (Pitch Deck Strategy)
ఐటీ పార్కులు లేదా హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడేటప్పుడు "సార్ నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు స్థలం ఇవ్వండి" అని అడిగితే ఒప్పుకోరు. వాళ్లకు ఒక వాల్యూ ప్రొపోజిషన్ (Value Proposition) చూపించాలి:
"సార్, మీ ఆఫీస్/హాస్పిటల్ లో వందల మంది ఉంటారు. వాళ్లకు అర్ధరాత్రి ఆకలి వేస్తే బయటకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల సెక్యూరిటీ సమస్యలు వస్తాయి, ఉద్యోగుల ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అందుకే నేను ఇక్కడ 'జీరో కాస్ట్' తో స్మార్ట్ వెండింగ్ మెషిన్ పెడతాను. దీనివల్ల మీ స్టాఫ్ కి 24 గంటలు స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. కరెంట్ బిల్లు కూడా నేనే కడతాను, పైగా మీకు నెలవారీ రెంట్ లేదా సేల్స్ లో కొంత కమిషన్ కూడా ఇస్తాను."
ఈ విధంగా మాట్లాడితే ఏ మేనేజ్మెంట్ అయినా వద్దు అనదు. ఎందుకంటే వాళ్లకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఖాళీగా ఉన్న 4 అడుగుల స్థలంలో అద్దె ఆదాయంతో పాటు తమ స్టాఫ్ కి ఒక మంచి ఫెసిలిటీ దొరుకుతుంది.
గుర్తుంచుకోవాల్సిన రిస్కులు (Risks to Consider)
వ్యాండలిజం (మెషిన్ పాడు చేయడం): కొందరు గ్లాస్ పగలగొట్టడం లేదా వస్తువుల కోసం గట్టిగా ఊపడం చేస్తుంటారు. అందుకే మెషిన్ ని ఎప్పుడూ ఓపెన్ రోడ్డు మీద కాకుండా సెక్యూరిటీ గార్డ్ మరియు సీసీటీవీ ఉన్న ఇండోర్ లొకేషన్ లోనే పెట్టాలి.
ఎక్స్పైరీ డేట్ మేనేజ్మెంట్: స్నాక్స్, బిస్కెట్లకు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఏ వస్తువు ఎక్కువ సేల్ అవ్వడం లేదో గమనించి, అది ఎక్స్పైర్ అవ్వకముందే తీసేసి వేరే ప్రొడక్ట్ లోడ్ చేయాలి.
టెక్నికల్ సమస్యలు: ఒక్కోసారి కాయిన్ ఇరుక్కుపోవడం లేదా యూపిఐ పేమెంట్ అయ్యాక కూడా వస్తువు కింద పడకపోవడం జరగవచ్చు. అందుకే మెషిన్ పైన మీ మొబైల్ నెంబర్/కస్టమర్ కేర్ నెంబర్ స్పష్టంగా కనిపించేలా బోర్డు పెట్టాలి. ఫోన్ రాగానే వెంటనే ఆన్లైన్ లో రీఫండ్ చేసేయాలి.
ముగింపు
Fture అంతా ఆటోమేషన్ దే! రాబోయే రోజుల్లో సాంప్రదాయ రిటైల్ షాప్ ల స్థానాన్ని ఈ స్మార్ట్ వెండింగ్ మెషిన్లు భర్తీ చేయబోతున్నాయి. తక్కువ బడ్జెట్ ఉంటే బస్ స్టాండ్ కాయిన్ మెషిన్స్, పక్కా ప్లానింగ్ ఉంటే ఐటీ పార్క్ స్మార్ట్ మెషిన్స్—ఏది ఎంచుకున్నా సరే, ట్రెండ్ ను ముందే గుర్తించేవారే బిజినెస్ లో గెలుస్తారు!
మీకు ఏ లొకేషన్ మరియు ఏ మెషిన్ ఐడియా బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి!
డీలర్స్ కాంటాక్ట్ లిస్ట్
Nimesh Innovations
Ahmedabad
+91 80 4382 2868
Vendekin Technologies Private Limeted
Pune
+91 79 4282 3357
ముఖ్య గమనిక: ఇక్కడ ఇవ్వబడిన డీలర్ల సమాచారం కేవలం ఇండియామార్ట్ రేటింగ్స్ ఆధారంగా సేకరించబడింది. వీరికి, మా 'బిజినెస్ లోకం బై Anil' ఛానల్‌కు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు చెల్లించే ముందు లేదా ప్రొడక్ట్స్ కొనే ముందు డీలర్ల జెన్యూనిటీని (Genunity) మీ స్వంతంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. లావాదేవీలలో జరిగే ఎలాంటి నష్టాలకు మేము బాధ్యులం కాము.
డిస్క్లైమర్: ఈ బ్లాగ్ మరియు ఇందులో అందించిన సమాచారం కేవలం అవగాహన (Educational Purpose) కోసం మాత్రమే తయారు చేయబడింది. వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు తగిన మార్కెట్ రీసెర్చ్ మరియు నిపుణుల సలహాలు పొందవలసిందిగా మనవి. ఈ బిజినెస్ చేయడం వల్ల మీకు వచ్చే లాభాలకు లేదా నష్టాలకు మా ఛానల్ ఎలాంటి బాధ్యత వహించదు.
Important Note: The dealer information provided here is gathered solely based on IndiaMart ratings. There is no affiliation between these dealers and our channel 'Business Lokam by Anil'. Please verify the genuineness of the dealers on your own, at least twice, before making any payments or purchasing products. We are not responsible for any financial losses incurred during these transactions.
Disclaimer: This blog is created strictly for educational purposes only. We advise you to conduct thorough market research and consult experts before making any business decisions. Our channel holds no responsibility or liability for any profits earned or losses incurred by pursuing this business.
Comments
Post a Comment