స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? బిగినర్స్ కోసం పూర్తి అవగాహన (NSE, BSE, Nifty & Sensex Explained)
ప్రస్తుత కాలంలో చాలా మంది తమ సంపాదనను లేదా పొదుపు చేసిన డబ్బును ఎలా పెంచుకోవాలో అన్వేషిస్తున్నారు. దానికి గాను వివిధ రకాల మార్గాలను వెతుకుతున్నారు. సాధారణంగా మనం మన డబ్బును బ్యాంకు ఖాతాలో లేదా ఇంట్లో దాచుకుంటే, రోజురోజుకు దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది . దీనినే ద్రవ్యోల్బణం అంటారు (Inflation) . దీని కారణంగా కాలక్రమేణా ఆ డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో మన డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టి దానిని పెంచుకోవడానికి ఆలోచిస్తారు. ఇలా ఉన్న ప్రధాన మార్గాలలో స్టాక్ మార్కెట్ (Stock Market) ఒకటి.
అయితే, అవగాహన లేకపోవడం వల్ల చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఒక జూదం అని భావించి భయపడుతుంటారు. అసలు నిజానికి స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను ఈ వ్యాసంలో సులభంగా తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? (ఏర్పాటు మరియు పనితీరు)
చాలామందికి స్టాక్ మార్కెట్ అనేది ఒక గందరగోళమైన అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. కానీ easy గా అర్థం చేసుకోవడానికి, దీనిని మన ఊర్లో ఉండే కూరగాయల మార్కెట్‌తో పోల్చవచ్చు.
మన కూరగాయల మార్కెట్‌లో రైతులు మరియు వ్యాపారులు కూరగాయలను అమ్ముతూ ఉంటారు. కూరగాయలు కావలసినవారు వాటిని కొంటూ ఉంటారు. ఈ కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు డిమాండ్ మరియు సప్లై మీద (Demand and Supply) ఆధారపడి నిర్ణయించబడతాయి:
అంటే సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే: ఉదాహరణకు ఒకరోజు మార్కెట్‌కి టమాటాల రాక తక్కువగా ఉండి, కొనేవారు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా ధర పెరుగుతుంది. అంటే ఆరోజు టమాటా క చాలా డిమాండ్ ఉంది అని అర్థం.
సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువ ఉంటే: ఇంకో రోజు మార్కెట్‌లోకి టమాటాలు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి కొనేవారు తక్కువగా ఉంటే, వ్యాపారులు ధర తగ్గించి అమ్ముతారు. అంటే డిమాండ్ చాలా తక్కువగా ఉంది అని అర్థం.
స్టాక్ మార్కెట్ కూడా సరిగ్గా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. ఇక్కడ కూరగాయలకు బదులుగా దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల షేర్లు (Shares) కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి.
ఇక్కడ కూడా మన కూరగాయల మార్కెట్ లోని టమాటాలు లాగా ఒక కంపెనీ భవిష్యత్తులో మంచి లాభాలు సాధిస్తుందని ఎక్కువ మంది భావిస్తే, దానికి డిమాండ్ పెరిగి షేర్ ధర పెరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా కంపెనీకి ఒక మంచి పెద్ద ఆర్డర్ వచ్చిన కానీ ఇలాంటిది ఉంటుంది
కంపెనీ నష్టాల్లో ఉంటే లేదా ఫ్యూచర్ లో జరిగే దాని నిర్ణయాల వల్ల ఏదైనా నష్టాలు జరగవచ్చు అని లేదా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే, షేర్లను విక్రయించేవారు ఎక్కువై ధర తగ్గుతుంది.
మన దేశంలో (భారత్‌లో) నీ ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు (Stock Exchanges in India)
మన దేశంలో కంపెనీల షేర్లను చట్టబద్ధంగా కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి: అవే
1. NSE : దీని పూర్తి పేరు National Stock Exchange అంటారు.ఇది భారతదేశంలోని అత్యంత ఆధునికమైన స్టాక్ ఎక్స్చేంజ్.
దీని యొక్క ప్రధాన Index(సూచీ) ను నిఫ్టీ 50 (Nifty 50) అంటారు. అంటే ఇందులో దేశంలోని అతిపెద్ద కంపెనీలైన 50 కంపెనీల యొక్క షేర్లు ఉంటాయి.
2. BSE దీని పూర్తి పేరు Bombay Stock Exchange అంటారు.ఇది ముంబైలో ఉంది. భారత్‌లోనే కాక, మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్.
దీని Index(సూచీ)ని సెన్సెక్స్ (Sensex) అంటారు. ఇందులో దేశంలోని ప్రముఖ 30 కంపెనీలు ఉంటాయి.
గమనిక: న్యూస్ ఛానల్స్‌లో "ఈరోజు నిఫ్టీ పెరిగింది" లేదా "సెన్సెక్స్ పడిపోయింది" అని చెబుతుంటారు. అంటే అర్థం దేశంలోని టాప్ కంపెనీల షేర్ ధరలు సగటున పెరిగాయి లేదా తగ్గాయి అని అర్థం.
స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించే మార్గాలు ప్రధానంగా రెండు ఉన్నాయి.స్టాక్ మార్కెట్ ద్వారా లీగల్‌గా మరియు క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి:
1.షార్ట్ టర్మ్ ట్రేడింగ్ (Short-Term Trading):
షేర్లను కొద్ది రోజులు లేదా కొద్ది వారాల వ్యవధిలో కొని, ధర పెరగ్గానే అమ్మేయడం.
దీని కోసం టెక్నికల్ అనాలసిస్ మరియు మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ప్రారంభంలో ఉన్నవారు (Beginners) నేరుగా ట్రేడింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
2.లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ (Long-Term Investing):
నమ్మకమైన మరియు బలమైన పునాదులు ఉన్న కంపెనీలను ఎంచుకుని, ఆ కంపెనీ షేర్లు ను కొని ,కొన్ని సంవత్సరాల పాటు ఆ పెట్టుబడిని కొనసాగించడం. ఆ కంపెనీ వ్యాపారం పెరిగే కొద్దీ మీ షేర్ విలువ పెరుగుతుంది. అంతేకాకుండా కంపెనీలు లాభాలు వచ్చినప్పుడు ఇచ్చే డివిడెండ్లు (Dividends) ద్వారా కూడా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది.
మరి బిగినర్స్ దీనిని ఎలా ప్రారంభించాలి?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి ప్రారంభించడానికి మొదట రూ. లక్షలు అవసరం లేదు. నెలకు రూ. 100 నుండి రూ. 500 తో కూడా ప్రారంభించవచ్చు. దీనికోసం మనకు ఒక డిమార్ట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది.
డీమాట్ ఖాతా (Demat Account): ఇది ఎలాగైతే మన డబ్బును బ్యాంకు అకౌంట్‌లో దాచుకుంటాము అదేవిధంగా మనం కొనుగోలు చేసే షేర్లను కూడా డిజిటల్‌గా భద్రపరచడానికి ఒక డీమాట్ ఖాతా అవసరం.
గుర్తింపు పొందిన స్టాక్ బ్రోకర్ల ద్వారా సులభంగా డీమాట్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
SEBI నియమాలు - పెట్టుబడిదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల హక్కులను మరియు డబ్బును కాపాడటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో SEBI (Securities and Exchange Board of India) అనే అత్యున్నత సంస్థ పనిచేస్తుంది.
SEBI మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలు:
ఫేక్ రికమండేషన్లు నమ్మవద్దు: WhatsApp, Telegram గ్రూపులలో వచ్చే రాత్రికి రాత్రే డబ్బులు డబుల్ చేస్తామనే టిప్స్, ఫేక్ రికమండేషన్లను అసలు నమ్మకూడదు.
అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయవద్దు: ఎప్పుడూ లోన్లు లేదా అప్పులు తీసుకుని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టకూడదు.
సొంత అవగాహన: మీ స్వంత అధ్యయనం లేదా SEBI వద్ద రిజిస్టర్ అయిన సర్టిఫైడ్ అడ్వైజర్ల సలహాతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి.
ముగింపు
స్టాక్ మార్కెట్ అనేది భయపడాల్సిన విషయం కాదు. సరైన అవగాహన, క్రమశిక్షణ మరియు దీర్ఘకాలిక ఆలోచనతో అడుగులు వేస్తే ఇది మీ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా మారుతుంది.
Disclaimer:
ఈ వ్యాసంలో అందించబడిన సమాచారం కేవలం విద్యా మరియు అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే (Educational Purposes Only). ఇది ఎలాంటి ఆర్థిక, పెట్టుబడి లేదా కొనుగోలు/అమ్మకాల సలహా (Financial Advice) కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ స్వంత అధ్యయనం (Research) చేయండి లేదా సెబి (SEBI) రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి. ఈ సమాచారాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ఎలాంటి లాభనష్టాలకు ఈ వెబ్‌సైట్ బాధ్యత వహించదు.
Disclaimer:
The information provided in this article is for educational and informational purposes only and should not be construed as financial advice. Stock market investments are subject to market risks. Please read all scheme-related documents carefully and conduct your own research or consult a SEBI-registered financial advisor before making any investment decisions. We do not guarantee any profits or take responsibility for any financial losses.
Comments
Post a Comment